వదిలెయ్యమంటావు, వేలు పట్టుకుంటావు
ఎండమావికై పరిగెడతావు, వద్దొంటే నొచ్చుకుంటావు
స్వార్థాన్ని స్వాగతిస్తావు, బాధ్యతల్ని విస్మరిస్తావు
గతించిన జ్ఞాపకాలు గుండె నిండా నింపుకుంటావు
గమ్యమెరుగని పయనాలు ఒంటరిగా చేస్తావు
పలుచటి బతుకులలో ముళ్ళ కలలు కంటావు
అసత్యాల చీకటిలో కలకాలం గడపగలవా?
ఊహల మైకాన్ని వీడి, నిజానిజాలు పరికించలేవా?
కనుల పొరలు చీల్చి, వెలుగు కిరణాల్ని ఆహ్వానించవా?